LATEST UPDATES

Friday, October 10, 2025

పశువుల మేతగా ఉల్లిపాయలతో డేంజర్:

        ఉల్లి రేటు లేని సమయంలో రైతులు ఆ పొలాలను గొర్రెలు, మేకలు, పశువులకు మేతగా వదిలివేస్తుంటారు. కానీ, ఇది చాల ప్రమాదకరమని వెటర్నరీ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఉల్లిపాయల్లో ఉండే N-propyl disulfide అనే రసాయనం పశువుల్లో ఎర్రరక్తకణాలను విడదీస్తుంది. దీని వాళ్ళ పశువులలో బలహీనత, కళ్ళు, మూత్రం ఎర్రగా మారటం, శ్వాసలో వేగం పెరగటం, కడుపులో వాపు, చివరగా మరణించే ప్రమాదం ఉంటుందంటున్నారు. 

నియంత్రణ & నివారణ:

1. పరిమిత మోతాదులో మేత ఇవ్వండి

  • ఒక రోజులో పశువు తినే మొత్తం మేతలో 5-10 శాతానికి మించి ఉల్లిపాయలు ఉండేలా చూసుకోవాలి.

  • అది కూడా వారంలో 2-3 రోజులు మాత్రమే ఇవ్వాలి. ఈ పరిమితికి మించితే పశువుల కళ్ళు, మూత్రం ఎర్రగా మారిపోతాయి. ఆహరం తీసుకోవు

2. పౌష్టిక సహాయాలు

  • ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుల సూచనలతో విటమిన్ ఇ, సెలీనియం, ఫోస్ఫరాస్ ఇంజెక్షన్లు, లివర్ టానిక్ లు, చరక లిక్విడ్ లాంటివి ఇవ్వాలి. 

3. ఆహారం సరళీకరణ

  • మేత తర్వాత ఇతర ఘన ఆహారాలు మరియు హై-ప్రోటీన్ ఆహారాలు (పప్పులు, గడ్డి కషాయాలు) ఇచ్చి శక్తిని పెంచాలి.

4. వైద్య సూచనలు తీసుకోండి

  • పైన చెప్పబడిన ఏ లక్షణం కనపడిన వెంటనే వెటర్నరీ డాక్టర్ సంప్రదించాలి.

  • అవసరమైతే రక్తపరీక్షలు చేయించాలి.


ప్రధానమంత్రి ధన్-ధాన్య కృషి యోజన పథకం

            కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రధానమంత్రి ధన్-ధాన్య కృషి యోజన (PM Dhan-Dhaanya Krishi Yojana, PMDDKY) అనే పథకాన్ని ఆమోదించింది.

కింద ఈ కేంద్ర పథకం ముఖ్య వివరాలు తెలుసుకొందాం:

🎯 పథకం ఉద్దేశ్యం (Objectives)

  • వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం

  • పంట వైవిధ్యాన్ని (crop diversification) మరియు సుస్థిర (sustainable) వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం.

  • పంటల కోత తరువాత నిల్వ సదుపాయాలను (post-harvest storage) గ్రామ / బ్లాక్ స్థాయిలో మెరుగుపరచడం

  • సేద్యపు నీటి సౌకర్యాలను మెరుగుపరచడం

  • రైతులకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలను సులభతరం చేయడం

  • రైతుల ఆదాయాలను మెరుగుపరుచడం, మార్కెట్‌లలో  సముచిత (fair) ధరలు అందించడం.

📅 కాలం & వ్యయం (Duration & Funding) 

  • ఈ పథకాన్ని 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి 6 సంవత్సరాల పాటు అమలు చేయనున్నది

  • ప్రతి సంవత్సరం ₹24,000 కోట్ల నిధులు కేటాయించనున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం (Central Government Scheme) — అంటే ఆ ఖర్చు మొత్తం కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది.

📍 జిల్లాల ఎంపిక (Districts & Selection)

  • దేశవ్యాప్తంగా 100 వ్యాపారంగా వ్యవసాయం లో వెనుకబడి  ఉన్న జిల్లాలు (low-performing agricultural districts) ఈ పథకం పరిధిలో ఉంటాయి.
  • ప్రతి రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం నుండి కనీసం ఒక జిల్లా ఉండేలా ఎంపిక చేస్తారు.
  • ఈ జిల్లాలను ఎంపిక చేసే విధానం:

    1. తక్కువ ఉత్పాదకత (low productivity) 

    2. పంటల సాగు తీవ్రత తక్కువగా ఉండటం (low cropping intensity) 

    3. రుణ పంపిణీ పరంగా వ్యతిరేక పరిస్థితులు ఉండటం (credit access issues) 

🛠️ అమలు (Implementation)

  • 11 different Ministries & 36 existing కేంద్ర పథకాలను ఈ ప్రాజెక్టులో సమన్వయ పద్ధతిలో చేర్చబోతున్నారు.

  • జిల్లాకు చెందిన ధన్-ధాన్య సమితులు (Dhan-Dhaanya Committees) ఏర్పాటుచేస్తారు , అక్కడ ప్రాంతీయ వ్యవసాయ పరిస్థితులను బట్టి ప్రణాళికలు రూపొందిస్తారు.

  • ప్రగతిని ట్రాక్ చేయడానికి ఓ డిజిటల్ డాష్బోర్డు (digital dashboard) ఏర్పాటు చేస్తారు, 117 కీలక పనితీరు సూచికలతో (KPI) పర్యవేక్షణ జరుగుతుంది.

👩‍🌾 లాభం పొందేవారు & ప్రయోజనాలు (Beneficiaries & Benefits)

  • మొత్తం 1.7 కోట్ల (17 million) రైతులు దీని నుంచి లాభపడతారని ప్రభుత్వం అంచనా వేస్తుంది.

  • రైతులు మంచి విత్తనాలు, ఎరువులు, ఆధునిక పద్ధతులు ఉపయోగించటం ద్వారా పంటల దిగుబడిని పెంచుకోవచ్చు.

  • నిల్వ (storage) సదుపాయాలు మెరుగవ్వడంతో పంటల నష్టం తగ్గుతుంది .

  • సేంద్రీయ, సుస్థిర పద్ధతుల్లో సాగు ప్రోత్సహించడం, పర్యావరణ స్నేహపూర్వక పద్ధతులు అమలులోకి తీసుకురావడం.

  • రైతులకు రుణ సదుపాయం, మరియు క్యాష్ ఫ్లో మెరుగుదల.

🤔 దరఖాస్తు విధానము (Application / Enrollment Process)

        ప్రచురించిన సమాచారం ప్రకారం, ప్రత్యక్ష దరఖాస్తు కార్యక్రమం గురించి ఇప్పుడే స్పష్టమైన మార్గదర్శకాలు ప్రకటించబడలేదు.

  • అధికారిక ప్రకటనలు ఈ పథకానికి సంబంధించిన అధికారిక వెబ్‌సైట్ల ద్వారా రావాల్సి ఉంటుంది.

  • గ్రామ, బ్లాక్, జిల్లా స్థాయిలో రైతు జాబితాలు ఇప్పటికే ఉంటే, ఆ జాబితాల ఆధారంగా ఎంపిక జరగవచ్చు.

  • రైతులు తమ వ్యవసాయ నుంచి సంబంధిత ఆధారాలు (భూమి వివరాలు, అభివృద్ధి కార్డులు, బ్యాంక్ ఖాతాలు) సిద్ధం చేసుకోవాలి.

  • కేంద్ర విధాన ప్రకారం, సమన్వయంగా ఉన్న పథకాలకూ (36 schemes) దరఖాస్తు విధానాలు ఉండగలవు.



Wednesday, October 8, 2025

పాడిపంట రైతులకు భరోసా: ఉచిత పశుగ్రాసం సాగు పథకం — అర్హతలు, ఎంపిక, ప్రోత్సాహకాలు

           వ్యవసాయ భూమి ఉండి, పాడి పశువుల పోషణతో కుటుంబాలను పోషించుకొంటున్న చిన్న, సన్నకారు రైతులకు లబ్ది చేకూరేలా ప్రభుత్వం "ఉచిత పశుగ్రాసం సాగు పథకంని అమల్లోకి తెచ్చింది. ఈ  పథకం కింద పశుగ్రాసం సాగు చేస్తే ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద 100% (వందశాతం) రాయితీ అందిస్తుంది. కనిష్ఠంగా 10 సెంట్లు, గరిష్ఠంగా 50 సెంట్ల వరకు పశుగ్రాసాన్ని పెంచుకోవచ్చు. కనిష్ఠంగా రూ. 6,559, గరిష్ఠంగా రూ. 32,992 ప్రభుత్వ సాయంగా అందుతుంది.  

👨‍🌾 అర్హతలు:

            పశువులు, ఉపాధిహామీ పథకం జాబ్ కార్డు కలిగిన రైతులకు మాత్రమే ఉచిత పశుగ్రాసం సాగు పథకం వర్తిస్తుంది. 5 ఎకరాల లోపు భూమి ఉన్న SC, ST, చిన్న, సన్నకారు రైతులు ఈ పథకానికి అర్హులు. పశుగ్రాసం సాగుకు నీటి వసతి ఉన్న భూములను మాత్రమే ఎంపిక చేస్తారు.

🧾 ఎంపిక ప్రక్రియ: 

  • రైతులు గ్రామ స్థాయిలో రైతుసేవ కేంద్రం లేదా పశువైద్యాధికారిని సంప్రదించి దరఖాస్తు చేయాలి. 

  • రైతులు తమ దరఖాస్తుతో పాటు రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, పొలం 1బీ, జాబ్‌కార్డు, బ్యాంకు పాసుపుస్తకం జిరాక్స్‌లను అందజేయాలి.

  • గ్రామ సభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది.

  • ఎంపిక జరుగుతున్నప్పుడు నీటి వసతి, భూమి స్థాయితనం, ఇతర కారకాలు పరిశీలించబడతాయి.

🌿 ఉచిత పశుగ్రాసం సాగు పథకం ప్రోత్సాహకాలు:

--> 50 సెంట్లలో సాగుకు ప్రభుత్వం రూ. 32,992 (కూలీల వేతనం రూ. 15,000, సామాగ్రికి రూ. 17,992)  

--> 40 సెంట్లలో సాగుకు ప్రభుత్వం రూ. 26,394 (కూలీల వేతనం రూ. 12,000, సామాగ్రికి రూ. 14,394)  

--> 30 సెంట్లలో సాగుకు ప్రభుత్వం రూ. 19,795 (కూలీల వేతనం రూ.   9,000, సామాగ్రికి రూ. 10,795)  

--> 20 సెంట్లలో సాగుకు ప్రభుత్వం రూ. 13,197 (కూలీల వేతనం రూ.   6,000, సామాగ్రికి రూ.   7,197) 

--> 10 సెంట్లలో సాగుకు ప్రభుత్వం రూ.   6,559 (కూలీల వేతనం రూ.   3,000, సామాగ్రికి రూ.   3,559) అందిస్తుంది. 

Tuesday, October 7, 2025

🌸 కనకాంబరంలో ఎండు తెగులు (Dry Rot / Leaf Spot) — లక్షణాలు, కారణాలు & నియంత్రణ

        కనకాంబరంలో ఎండు తెగులు ముఖ్యమైన సమస్య. ఎండు తెగులు (Dry Rot / Leaf Spot) వ్యాధి ఎక్కువగా తేమ ఉన్న పరిస్థితుల్లో వస్తుంది. ఈ వ్యాధి ఫంగస్ వల్ల వస్తుంది మరియు ఆకులను ఎండబెట్టి పంట దిగుబడిని తగ్గిస్తుంది.

🌿 వ్యాధి లక్షణాలు (Symptoms):

        ఈ తెగులు ఆశించిన కనకాంబరం మొక్క ఆకులు వాలిపోయి, ఆకు అంచు పసుపు రంగుకు మారుతుంది. వేర్లు, కాండం, మొదలు కుళ్ళడం వాళ్ళ మొక్క అకస్మాత్తుగా ఎండిపోతుంది. దీంతో మొక్కలు గుంపులుగా చనిపోతాయి. 

🧴 నివారణ మార్గాలు (Control Measures):

1. సహజ (ఆర్గానిక్) నియంత్రణ

  • నిమ్మ / తులసి సారం కలిపిన ద్రావణాన్ని స్ప్రే చేయండి.

  • ట్రైకొడెర్మా హార్జియానం పౌడర్‌ను నేలలో కలపడం వ్యాధి నియంత్రిస్తుంది.

  • బాసిలస్ సబ్‌టిలిస్ వంటి సూక్ష్మ జీవకాలు ఫంగస్ వ్యాప్తిని అడ్డుకుంటాయి.

2. రసాయన నియంత్రణ

  • తెగులు ఆశించిన మొక్కల మోడళ్ళు తడిచేలా .. మాంకోజెబ్ 2.5 గ్రా / లీటర్ నీరు లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా / లీటర్ నీటితో స్ప్రే చేయండి. (ఒక్కో మొక్కకు 20-25 మిల్లీ లీటర్ల ద్రావణాన్ని పోయాలి).

  • 10–15 రోజులకు ఒకసారి పునరావృతం చేయండి.



🌾 ముగింపు

    కనకాంబరంలో ఎండు తెగులు వ్యాధిని సమయానికి గుర్తించి సరైన నియంత్రణ చర్యలు తీసుకుంటే, పంటను రక్షించవచ్చు. సహజ మరియు రసాయన నియంత్రణను సమన్వయం చేస్తే అధిక దిగుబడి సాధ్యమవుతుంది.


🌾సులభంగా విత్తనం నాటే 'హ్యాండ్ పుష్ సీడర్'


        రైతులు సాధారణంగా విత్తనాలు కూలీల సాయంతో చేతితో నాటేవారు. అయితే కూలీల కొరత, ఖర్చు పెరగడం వంటి సమస్యలతో వ్యవసాయంలో విత్తనాలు నాటడం ఒక కష్టమైన ప్రక్రియగా మారింది. ఈ సమస్యను అధిగమించటానికి సులభంగా విత్తనాలను నాటే యంత్రం అయినటువంటి 'హ్యాండ్ పుష్ సీడర్' అందుబాటులోకి వచ్చింది. దీని సహాయంతో ఒక మనిషి రోజుకు రెండు నుండి నాలుగు ఎకరాల వరకు విత్తనాలు నాటుకోవచ్చు. మొక్కకు మొక్కకు దూరం (Row Spacing) కోసం విత్తనం ఎంత దూరంలో కావాలంటే అంట దూరంలో పడేలా అడ్జెస్ట్ చేసుకొనే అవకాశం దీనిలో ఉంది. ప్రత్తి, కూరగాయలు, మొక్కజొన్న, ఆముదం సహా ఇతర విత్తనాలు నాటవచ్చు.

⚙️ హ్యాండ్ పుష్ సీడర్ వాడే విధానం:

  • నేలను ముందుగా తగిన విధంగా సంసిద్ధం చేయాలి.

  • విత్తనాన్ని సీడర్‌లో లోడ్ చేయాలి.

  • యంత్రాన్ని నెట్టడం ద్వారా విత్తనాలు సమానంగా నేలలో పడతాయి.

  • విత్తనాల రకం ఆధారంగా స్పేసింగ్ సర్దుబాటు చేయాలి.

🧰 నిర్వహణ సూచనలు:

        ఈ యంత్రంలో సాధారణంగా తక్కువ విడి భాగాలు ఉంటాయి; కాబట్టి తక్కువ కొనుగోలు ఖర్చు, మరమ్మత్తు చేయడం సులభం. నిర్వహణ (Maintenance) కూడా (ఆయిల్ చేయడం, భాగాల శుభ్రత) చాలా సులభం. 

💡 రైతులకు లాభాలు:

  • సమయం మరియు కూలీ ఖర్చు తగ్గింపు

  • సమానమైన మొలకలు

  • పంట ఉత్పాదకత పెరుగుతుంది

  • తక్కువ పెట్టుబడితో అధిక ఫలితాలు

Sunday, October 5, 2025

నులిపురుగులతో కనకాంబరం పంటకు నష్టం



                నులిపురుగులు కనకాంబరం మొక్కల వేర్లలోకి రంద్రాలు చేసుకొని వెళ్లి వేర్లపై బొడిపెలను కలుగజేస్తాయి. దీని వల్ల ఆకు ముడుచుకొని ఊదా రంగుకు మారి మొక్కలు గిడసబారిపోతాయి. ఫలితంగా పూల పరిమాణం, దిగుబడి తగ్గుతుంది. ఈ పురుగుల వల్ల ఎండు తెగులు సోకె ప్రమాదం ఉంది. నులిపురుగుల నివారణ కోసం ఎకరాకు 200 కిలోల వేప పిండి ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. బంతి పూలతో పంట మార్పిడి చేసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

బత్తాయి లో 'తొడిమ కుళ్లు ' తెగులు లక్షణాలు - నివారణ చర్యలు


        బత్తాయి తోటల్లో కాయ తయారయ్యే దశలో "తొడిమ కుళ్లు" తెగులు ఆశించి నష్టాన్ని కలిగిస్తుంది. దీనినే 'వడప', 'బొడ్డుకుళ్లు' తెగులు అని కూడా అంటారు. ఈ వ్యాధి లక్షణాలు, కారణాలు మరియు నివారణ మార్గాలు తెలుసుకుని ముందుగానే చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం.

లక్షణాలు:

        కాయ పక్వానికి రాకముందే చిన్న సైజులో ఉన్నప్పుడే తొడిమ నుండి ఊడి రాలిపోవడం ఈ తెగులు ప్రధాన లక్షణం. కొమ్మ చివరి భాగాలలో, అభివృద్ధి చెందుతున్న కాయ తొడిమలపై ఈ తెగులు ప్రభావం ఎక్కువ. చిన్న కాయలుగా ఉన్నప్పుడే రాలిపోవడం వల్ల దిగుబడి తగ్గి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది.

నివారణ మార్గాలు:

        తొడిమ కుళ్లు సోకి, రాలిపోయిన కాయలను ఏరి నాశనం చేయాలి. తెగులు నివారణకు లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రా. లేదా కార్బండిజం 1 గ్రాము కలిపి పిచికారీ చేయాలి. ప్రతి సంవత్సరం తొలకరిలో చెట్లలో ఎండుపుల్లలను కత్తిరించి నాశనం చేయాలి. శిలీంద్రానికి ఆశ్రయమిచ్చే కలుపు మొక్కలను సమర్ధవంతంగా అరికట్టేందుకు చెట్ల పొదల్లో మల్చింగ్ పద్దతిని అవలంభించాలి. తోటల్లో నీటి ఎద్దడి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. 


ముఖ్య సూచనలు

  • ప్రతి సీజన్లో  మొదలు వద్ద పరిశీలించాలి

  • మంచి నేల సంరక్షణ

  • సేంద్రియ పోషకాలు వాడాలి

సారాంశం
ఈ వ్యాధిని నివారించకపోవడం వల్ల రైతులకు భారీ నష్టం. కానీ లక్షణాలు తొలి దశలో గుర్తించి, సకాలంలో నివారణ చర్యలు తీసుకుంటే బత్తాయి ఆరోగ్యంగా ఉంటుంది, దిగుబడి కూడా పెరుగుతుంది.



@2020 All Rights Reserved. Designed by WWW.SMARTWAYTOSTUDY.COM !!!! Sitemap !!!! Blogger Templates