LATEST UPDATES

Wednesday, October 8, 2025

పాడిపంట రైతులకు భరోసా: ఉచిత పశుగ్రాసం సాగు పథకం — అర్హతలు, ఎంపిక, ప్రోత్సాహకాలు

           వ్యవసాయ భూమి ఉండి, పాడి పశువుల పోషణతో కుటుంబాలను పోషించుకొంటున్న చిన్న, సన్నకారు రైతులకు లబ్ది చేకూరేలా ప్రభుత్వం "ఉచిత పశుగ్రాసం సాగు పథకంని అమల్లోకి తెచ్చింది. ఈ  పథకం కింద పశుగ్రాసం సాగు చేస్తే ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద 100% (వందశాతం) రాయితీ అందిస్తుంది. కనిష్ఠంగా 10 సెంట్లు, గరిష్ఠంగా 50 సెంట్ల వరకు పశుగ్రాసాన్ని పెంచుకోవచ్చు. కనిష్ఠంగా రూ. 6,559, గరిష్ఠంగా రూ. 32,992 ప్రభుత్వ సాయంగా అందుతుంది.  

👨‍🌾 అర్హతలు:

            పశువులు, ఉపాధిహామీ పథకం జాబ్ కార్డు కలిగిన రైతులకు మాత్రమే ఉచిత పశుగ్రాసం సాగు పథకం వర్తిస్తుంది. 5 ఎకరాల లోపు భూమి ఉన్న SC, ST, చిన్న, సన్నకారు రైతులు ఈ పథకానికి అర్హులు. పశుగ్రాసం సాగుకు నీటి వసతి ఉన్న భూములను మాత్రమే ఎంపిక చేస్తారు.

🧾 ఎంపిక ప్రక్రియ: 

  • రైతులు గ్రామ స్థాయిలో రైతుసేవ కేంద్రం లేదా పశువైద్యాధికారిని సంప్రదించి దరఖాస్తు చేయాలి. 

  • రైతులు తమ దరఖాస్తుతో పాటు రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, పొలం 1బీ, జాబ్‌కార్డు, బ్యాంకు పాసుపుస్తకం జిరాక్స్‌లను అందజేయాలి.

  • గ్రామ సభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది.

  • ఎంపిక జరుగుతున్నప్పుడు నీటి వసతి, భూమి స్థాయితనం, ఇతర కారకాలు పరిశీలించబడతాయి.

🌿 ఉచిత పశుగ్రాసం సాగు పథకం ప్రోత్సాహకాలు:

--> 50 సెంట్లలో సాగుకు ప్రభుత్వం రూ. 32,992 (కూలీల వేతనం రూ. 15,000, సామాగ్రికి రూ. 17,992)  

--> 40 సెంట్లలో సాగుకు ప్రభుత్వం రూ. 26,394 (కూలీల వేతనం రూ. 12,000, సామాగ్రికి రూ. 14,394)  

--> 30 సెంట్లలో సాగుకు ప్రభుత్వం రూ. 19,795 (కూలీల వేతనం రూ.   9,000, సామాగ్రికి రూ. 10,795)  

--> 20 సెంట్లలో సాగుకు ప్రభుత్వం రూ. 13,197 (కూలీల వేతనం రూ.   6,000, సామాగ్రికి రూ.   7,197) 

--> 10 సెంట్లలో సాగుకు ప్రభుత్వం రూ.   6,559 (కూలీల వేతనం రూ.   3,000, సామాగ్రికి రూ.   3,559) అందిస్తుంది. 

No comments:

Post a Comment

@2020 All Rights Reserved. Designed by WWW.SMARTWAYTOSTUDY.COM !!!! Sitemap !!!! Blogger Templates