రైతులు సాధారణంగా విత్తనాలు కూలీల సాయంతో చేతితో నాటేవారు. అయితే కూలీల కొరత, ఖర్చు పెరగడం వంటి సమస్యలతో వ్యవసాయంలో విత్తనాలు నాటడం ఒక కష్టమైన ప్రక్రియగా మారింది. ఈ సమస్యను అధిగమించటానికి సులభంగా విత్తనాలను నాటే యంత్రం అయినటువంటి 'హ్యాండ్ పుష్ సీడర్' అందుబాటులోకి వచ్చింది. దీని సహాయంతో ఒక మనిషి రోజుకు రెండు నుండి నాలుగు ఎకరాల వరకు విత్తనాలు నాటుకోవచ్చు. మొక్కకు మొక్కకు దూరం (Row Spacing) కోసం విత్తనం ఎంత దూరంలో కావాలంటే అంట దూరంలో పడేలా అడ్జెస్ట్ చేసుకొనే అవకాశం దీనిలో ఉంది. ప్రత్తి, కూరగాయలు, మొక్కజొన్న, ఆముదం సహా ఇతర విత్తనాలు నాటవచ్చు.
⚙️ హ్యాండ్ పుష్ సీడర్ వాడే విధానం:
-
నేలను ముందుగా తగిన విధంగా సంసిద్ధం చేయాలి.
-
విత్తనాన్ని సీడర్‌లో లోడ్ చేయాలి.
-
యంత్రాన్ని నెట్టడం ద్వారా విత్తనాలు సమానంగా నేలలో పడతాయి.
-
విత్తనాల రకం ఆధారంగా స్పేసింగ్ సర్దుబాటు చేయాలి.
ఈ యంత్రంలో సాధారణంగా తక్కువ విడి భాగాలు ఉంటాయి; కాబట్టి తక్కువ కొనుగోలు ఖర్చు, మరమ్మత్తు చేయడం సులభం. నిర్వహణ (Maintenance) కూడా (ఆయిల్ చేయడం, భాగాల శుభ్రత) చాలా సులభం.
💡 రైతులకు లాభాలు:
-
సమయం మరియు కూలీ ఖర్చు తగ్గింపు
-
సమానమైన మొలకలు
-
పంట ఉత్పాదకత పెరుగుతుంది
-
తక్కువ పెట్టుబడితో అధిక ఫలితాలు
No comments:
Post a Comment