ద్రాక్షలో రకాల విషయానికి వస్తే సూపర్ సోన, మాణిక్ చమన్ వంటివి ప్రధానమైనవి. వీటిలో సూపర్ సోన వెరైటీ తెలుగు రాష్టాల్లో అంతగా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఏ రకం మొక్క.. వర్షం పడినప్పుడు కాయ పగిలి, చేనంతా పాడయ్యే అవకాశం ఉంటుంది. అందుకే వాతావరణానికి అనుకూలమైన మొక్కలు నాటుకోవాలి. మొక్కలను ఎకరానికి 1000 వరకు నాటుకోవాలి. మొక్కల మధ్య దూరం 10X4 ఉండేలా చూడాలి. ఇది తీగరకం పంట. కాబట్టి పొలంలో ౩౦౦ వరకు స్తంభాలు పాతుకొని గాలికి, వర్షానికి పడిపోకుండా, పందిరి కూలిపోకుండా ఏర్పాటు చేయాలి. ఎకరా ద్రాక్ష పంట కు దాదాపు రెండు లక్షల వరకు ఖర్చు అవుతుంది. ద్రాక్ష మొక్కలు నాటిన 16 నుంచి 18 నెలలకు కాపు మొదలవుతుంది. కాపు అందుకున్న అప్పటి నుంచి ఒక ప్రతిరోజు నీరు అందించాలి. ద్రాక్ష పంట మొదటి కాపు నుంచే ఎకరానికి 15 నుంచి 20 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. పంట ధర విషయానికి వస్తే సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో టన్నుకు దాదాపు 45 వేల నుంచి 50 వేల వరకు ఉంటుంది. నవంబర్ డిసెంబర్ నెలలో కాస్త తగ్గి టన్ను 35 వేల నుంచి 40 వేల వరకు వస్తుంది. ధర హెచ్చుతగ్గులకు రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదు.
ద్రాక్షలో తెగుళ్లు:
డోన్ మిల్లి, పౌడర్ మిల్లి ద్రాక్షలో ప్రధాన తెగుళ్ళు. వేసవిలో పేనుబంక, డోలియో తెగుళ్లు వంటివి వస్తాయి. వీటి నివారణకు పురుగు మందులు స్ప్రే చేసుకోవాలి. పురుగు మందులు స్ప్రే చేసుకునే సమయంలో పంట మీద నీరు లేకుండా చూడాలి. పంటపై నీరు ఉంటే కాయ పాడవుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో మొక్క పాదుల్లో నీరు నిలువకుండా చూడాలి ఎందుకంటే వర్షాలకు పంట అవుతుంది. ఈ పంట 40 డిగ్రీల వరకు వేడి తట్టుకుంటుంది. పశువుల ఎరువు, వర్మీ కంపోస్ట్, వేపచెక్క కలుపుకొని మొక్కలకు అందించాలి. తోటలో కలుపు రాకుండా ఉండాలంటే ఏడాదికి కనీసం 2-3 తోటను ట్రాక్టర్‌తో దున్నాలి. ఎక్కువ సార్లు దున్నినా, మొక్కకు దగ్గరగా దున్నినా.. మొక్క వేర్లు తెగిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలతో సాగు చేయాలి.
ఒకవేళ ఇది మీకు నచ్చితే : ఎండుద్రాక్షతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు