ఔషధ మొక్కగా నూనెగింజల పంట విశిష్ట ప్రాధాన్యత కలిగిన పంట కుసుమ. కుసుమ యొక్క శాస్త్రీయ నామం "కార్థామస్ టింక్టోరియస్". చల్లని వాతావరణంలో అధిక దిగుబడినిచ్చే ఈ పంట తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా సాగు చేయబడుతోంది. ఈ పంటకు నల్లరేగడి భూములు అనువైనవి. గతంలో ఈ పంటకు ఆదాయం తక్కువగా ఉండటం, మొక్కలకు ముళ్ళు ఎక్కువగా ఉండటం, కూలీలు దొరకకపోవడం వల్ల రైతులు ఈ పంట వేయటానికి వెనకడుగు వేశారు. ఇప్పుడిప్పుడే ఈ పంటకు దిగుబడి, ఆశించిన దానికంటే ఎక్కువ ఆదాయం వస్తుండడంతో రైతులు ఈ పంట వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ముళ్ళు లేని రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రత్యామ్నాయ పంటలు పండించాలి అనుకునే రైతులకు ఇది ఒక మంచి ఎంపిక. శీతాకాల పంట అయినటువంటి కుసుమ ఉత్తమ సాగు విధానం తెలుసుకుందాం.,
విత్తే సమయం:
విత్తనశుద్ధి:
విత్తన శుద్ధి చేశాక విత్తుకుంటే చీడల బెడద తక్కువగా ఉంటుంది. విత్తనం ద్వారా సంక్రమించే అల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు భూమిలోని శీలింధ్రాల ద్వారా సంక్రమించే ఎండు తెగులును నియంత్రించడానికి విత్తనశుద్ధి అత్యంత అవశ్యకం. 2 గ్రా. కాప్టాన్ లేదా 1 గ్రా. కార్బండాజిమ్, 4 కిలో విత్తనానికి కలిపి విత్తుకోవాలి.
కుసుమ రకాలు:
రకం | పంటకాలం (రోజుల్లో) | దిగుబడి (క్వి/ఎ) | గుణగణాలు |
టి.ఎస్.ఎఫ్.-1 | 125-130 | 6.0-7.0 | తెల్ల పూల రకము. అధిక దిగుబడినిచ్చి ఎండు తెగులును పూర్తిగా మరియు పేనుబంకను కొంత వరకు తట్టుకుంటుంది. ఇందులో నూనె శాతం ౩౦% ఉండటంతో పాటు ఎండు తెగులును తట్టుకొంటుంది. |
మంజీర | 115-120 | 4.0-5.0 | పూలు మొదట పసుపుగా ఉండి తరువాత నారంజి రంగుకు మారుతాయి. గింజ తెల్లగా ఉండి 27-30% నూనెను కలిగి వుంటుంది. |
నారి-6 | 130-135 | 5.0-6.0 | ఇది ముళ్ళులేని రకం కావడం వల్ల పంటకోత మరియు నూర్పిడి సులభతరమౌతుంది. పూతను సేకరించుకోవడానికి అనుకూలమైన రకం. |
పి.బి.ఎన్.ఎస్.12 | 130 | 7.0 | నీటి పారుదల క్రింద సాగుకు అనువైన రకం |
జె.యస్.ఎఫ్.414 (పూలే కుసుమ) | 135 | 8.0 | నీటి పారుదల క్రింద సాగుకు అనువైన రకం |
డి.యస్.హెచ్.-185 | 130 | 7.0-8.0 | ఎండు తెగులును తట్టుకునే సంకర రకం. |
రైతులకు ఇబ్బంది లేకుండా వరి కోత మిషన్ ద్వారా ఈ పంటను సులభంగా కోయవచ్చని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. కుసుమను ముఖ్యంగా వంట నూనె రంగుల కోసం సాగు చేస్తారు. సాగుచేసే విత్తన రకాల ఆధారంగా పంటకాలం 120 నుంచి 130 రోజులు ఉంటుంది. ఎకరాకు ఈ పంట లో ఆరు నుంచి పది క్వింటాళ్ల దిగుబడి వస్తుందని సాగుచేస్తున్న రైతులు చెబుతున్నారు. ఎకరాకు నాలుగు కిలోల విత్తనాలు అవసరమవుతాయి.
పంటల ప్రణాళిక:
కుసుమను పండించే రైతులు ప్రత్తి లేదా కంది వంటి పంటలతో మార్పిడి చేయడం వల్ల కుసుమను ఆశించే ఎండు తెగులును రాకుండా నివారించుకోవచ్చు. 1:2 నిష్పత్తిలో కుసుమను శెనగ లేదా ధనియాలతో అంతరపంటగా సాగు చేస్తే అధిక నికర ఆదాయాన్ని పొందవచ్చు.
No comments:
Post a Comment