భారతదేశంలో పాలు పితకడానికి "చేతితో పాలు పితికే విధానం" (మాన్యువల్ మిల్కింగ్) మరియు "యంత్రంతో పాలు పితికే విధానం" (మెషిన్ మిల్కింగ్) అనే రెండు పద్ధతులు ఉన్నాయి.
చేతితో పాలు పితికే విధానం (మాన్యువల్ మిల్కింగ్):
పాడి పశువులకు సరైన విధానంలో పాలు తీయకపోతే తక్కువ పాలు వచ్చే అవకాశాలున్నాయి. చేతితో పాలను పితకాలనుకొనే రైతులు ఫుల్ హ్యాండ్ పద్దతి, స్ట్రిప్పింగ్ పద్దతి, నక్లింగ్ పద్ధతులను అనుసరించాలి.
వీటిలో ఫుల్ హ్యాండ్ పద్దతి మెరుగైనది. పాలు పితకడానికి ఈ పద్దతి సులువుగా ఉంటుంది. ఫుల్ హ్యాండ్ పద్దతిలో ఎక్కువ పాలు పితకవచ్చు. మొత్తం ఐదు వేళ్లతో చనుమొనను పట్టుకుని, అరచేతికి వ్యతిరేకంగా నొక్కుతూ పూర్తిగా చేతితో పాలు పితకటం జరుగుతుంది.
నక్లింగ్ పద్దతిలో చేతి బొటనవేలు, ఇతర నాలుగు వేళ్ల సహాయంతో పితుకుతారు, కాబట్టి ముఖ్యంగా పాలు పితికే వారి వేళ్లకు గోర్లు లేకుండా చూసుకోవాలి. లేదంటే చనులకు గోర్లు గుచ్చుకుని గాయం అవుతాయి.
స్ట్రిప్పింగ్ పద్దతిలో బొటనవేలు, చూపుడు వేళ్లతో పాలు పితుకుతారు. ఈ విధానంలో బొటనవేలు మరియు చూపుడు వేలు మధ్య చనుమొనను గట్టిగా పట్టుకొని చనుమొన పొడవునా క్రిందికి లాగడం మరియు అదే సమయంలో పాలు ప్రవాహంలో ప్రవహించేలా నొక్కడం ద్వారా పాలు పితుకుతారు. ఈ పద్దతిలో గేదె లేదా ఆవు రొమ్ములో ఉన్న పాలను అన్నింటిని పితకటానికి అవకాశం ఉంటుంది. ఈ పద్ధతిలో పశువులకు రొమ్ము నొప్పి రాదు.
ఫుల్ హ్యాండ్ పద్ధతి, స్ట్రిప్పింగ్ పద్దతి కంటే మెరుగైనది. ఇది దూడ ద్వారా సహజంగా పాలిచ్చే ప్రక్రియను ప్రేరేపిస్తుంది మరియు ఆవులు మరియు గేదెల పెద్ద చనుమొనలపై ఈ పద్ధతి సమానమైన ఒత్తిడిని కలిగిస్తుంది.
No comments:
Post a Comment