కాలం మారుతున్న కొద్దీ వ్యవసాయంలో నూతన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే రైతుల పనులు సులభంగా చేసేలా ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో యంత్రాలు అందుబాటులోకి వస్తున్నాయి. వ్యవసాయంలో ప్రధానంగా గట్లు చెక్కడం రైతుకి శ్రమతో కూడుకున్నది. ఎందుకంటే పొలం చుట్టూ ఉండే గట్లు చెక్కడమే కాకుండా వాటికి మళ్లీ మట్టి అద్దాల్సిన పని ఉంటుంది. ఈ శ్రమను తగ్గించేందుకు ఇప్పుడు మార్కెట్‌లో గట్లు తయారు చేసే యంత్రం (Ridge Plastering Machine) అందుబాటులోకి వచ్చింది.
ఈ యంత్రం పొలంలోని గట్లు చెక్కడమే కాకుండా గట్టు ఎత్తు పెంచి ఒడ్డుపై మట్టి కూడా పెడుతుంది. ముఖ్యంగా రైతు కూలీలకు ఇచ్చే అదనపు ఖర్చు కూడా ఆదా అవుతుంది. ఈ గట్లను రైతు ఎకరంన్నర నుంచి రెండు ఎకరాల వరకు రోజంతా చెక్కుతాడు. అదే రిడ్జ్ ప్లాస్టరింగ్ యంత్రంతో రోజుకు దాదాపు 30 నుంచి 40 ఎకరాలు గట్లు చెక్కడం, అద్దడం పూర్తి చేయవచ్చు. ప్రస్తుతం ఈ యంత్రం మార్కెట్లో 3.50 లక్షల వరకు అందుబాటులో ఉంది. ఈ యంత్రం ట్రాక్టర్ కి అనుసంధానించి ఉంటుంది. ప్రస్తుతం ఈ మెషిన్ తో గట్లు సరిచేయిస్తే ఎకరాకు ₹500 నుండి ₹1000 వరకు తీసుకొంటున్నారు.ఎక్కువ పొలం ఉన్న రైతులు దీని ఉపయోగించి సమయాన్ని, డబ్బును ఆదా చేసుకోవచ్చు. గట్టు సైజు, ఎత్తు ఆధారంగా మెషిన్ ని సెట్ చేసుకోవచ్చు.
No comments:
Post a Comment