గొర్రెపిల్లల పోషణలో క్రీప్ దాణా (Creep Feed) చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. క్రీప్ దాణా అనేది చిన్న గొర్రె పిల్లలు (Lambs) తమ తల్లి పాలు తాగుతున్నప్పుడే, అదనపు పోషకాలు అందించడానికి ఏర్పాటు చేసే ప్రత్యేకమైన అధిక శక్తి గల దాణా. ఇది 3 నుంచి 7 వారాల వయస్సులో ఉన్న గొర్రె పిల్లలకు చాలా అవసరం. క్రీప్ ఫీడ్ అందించడం వలన పిల్లలు త్వరగా పెరుగుతాయి, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది మరియు పాలు మానేసే సమయానికి (Weaning) ఎదుగుదల దెబ్బతినకుండా ఉంటుంది.
100 కిలోల క్రీప్ దాణా తయారీ నమూనా ఫార్ములా:
మీరు గొర్రె పిల్లలకు అందించే క్రీప్ దాణాను నాణ్యతగా మరియు తక్కువ ఖర్చుతో ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.
తయారీ విధానం: పైన పేర్కొన్న అన్ని పదార్థాలను శుభ్రమైన ఫ్లోర్‌పై తీసుకుని బాగా మిక్స్ చేసి, గొర్రె పిల్లలు తినడానికి వీలుగా చిన్న గింజల రూపంలో (Crumbles) లేదా మెత్తటి మిశ్రమంగా తయారు చేసుకోవాలి. ఈ దాణాను గొర్రె పిల్లలకు 3 నుండి 7 వారాల వరకు తల్లిపాలతో పాటు అందించాలి. దీన్ని గొర్రె పిల్లల శరీర బరువులో ఒకటిన్నర్ర శాతానికి మించకుండా రోజూ అందించాలి.




.png)
.png)
.png)