LATEST UPDATES
Showing posts with label Pullorum Disease. Show all posts
Showing posts with label Pullorum Disease. Show all posts

Tuesday, October 21, 2025

🐔 కోళ్లలో వచ్చే పుల్లోరం వ్యాధి (తెల్లపారుడు) లక్షణాలు మరియు యాజమాన్యం

🔹 పరిచయం

    వాతావరణ పరిస్థితులలో మార్పుల కారణంగా పక్షులు, జంతువులలో వ్యాధులు వ్యాపిస్తుంటాయి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులతో పుల్లోరం వ్యాధి (Pullorum Disease) వ్యాపిస్తోంది.

🦠 పుల్లోరం వ్యాధి కారణం

        ఈ వ్యాధి యొక్క చారిత్రక పేరు బాసిల్లరీ వైట్ డయేరియా (Bacillary White Diarrhea). పుల్లోరం వ్యాధి సాల్మొనెల్లా ఎంటెరికా పుల్లోరం (Salmonella enterica Pullorum) అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. 

⚠️ వ్యాధి వ్యాప్తి విధానం

  • ఎక్కువగా కోళ్లు గుమికూడే ప్రదేశాలలో వ్యాధి త్వరగా వ్యాపిస్తుంది.

  • పరిశుభ్రత లేని పాత్రలలో ఆహారం ఇవ్వడం వల్ల వ్యాధి సోకుతుంది.

  • తల్లిపెట్టే గుడ్ల ద్వారా పిల్లలకు వ్యాధి సంక్రమిస్తుంది.

  • పిచ్చుకలు, చిలుకలు, కౌజులు వంటి పక్షులు కూడా ఈ వ్యాధిని మోసుకెళ్తాయి.

  • వ్యాధి చిన్న పిల్లలకు ఎక్కువగా వ్యాపిస్తుంది. 

🐥 లక్షణాలు

  • ప్రభావిత పక్షులు ఉష్ణ మూలం దగ్గర గుమికూడడం,

  • తెల్లని రెట్ట మలద్వారం వద్ద అంటుకొని ఉంటుంది,

  • అదనంగా, పక్షులకు శ్వాసకోశ ఇబ్బంది, కీళ్ల వాపు, అంధత్వం ఉండవచ్చు.

  • కోడిపిల్లలు నలతగా ఉండి ముడుచుకొని కూర్చోవడం

  • రెట్ట నీళ్లగా తెలుపు లేదా లేత పసుపు రంగులో కనిపించడం

  • గుండె, కాలేయం, పేగులపై తెల్లని మచ్చలు 

🧪వ్యాధి నిర్ధారణ:

    సంభావ్య సానుకూల పక్షులను గుర్తించడానికి సెరాలజీ (Serology) పరీక్ష ఉపయోగిస్తారు. అయితే ఇన్ఫెక్షన్‌ని నిర్ధారించడానికి ఐసోలేషన్, ఐడెంటిఫికేషన్ మరియు సెరోటైపింగ్ అవసరం. ఈ రోగం సోకినా పిల్లల్లో శ్వాస తీయడం భారంగా ఉంటుంది. ఈ వ్యాధి సోకిన కోడిపిల్లలు నలతగా ఉండి ముడుచుకొని కూర్చుంటాయి. రెట్ట నీళ్లగా తెలుపు లేదా లేత పసుపు పచ్చ రంగులో ఉంటుంది. రెక్కలు వాల్చటం వంటి లక్షణాలు ఉంటాయి. గుండె, కాలేయం, పేగులపై తెల్లని మచ్చలు కనిపిస్తాయి. 

💊 చికిత్స మరియు నియంత్రణ

  • వ్యాధిగ్రస్త పక్షులను మందల నుండి వేరు చేయాలి ఇది నియంత్రణలో కీలకం.

  • వెటర్నరీ నిపుణుల సూచన మేరకు యాంటీబయాటిక్స్ ఉపయోగించాలి.

  • ఈ వ్యాధి నివారణకు సల్ఫా లేదా టెట్రాసైక్లిన్ మందును చిటికెడు చొప్పున ఒక టీ గ్లాసు నీళ్లలో కలిపి రోజుకు రెండు సార్లు ఇవ్వాలి.

  • పక్షుల గూట్లను శుభ్రంగా ఉంచడం, ఆహార పాత్రలు, నీటి గిన్నెలు పరిశుభ్రంగా ఉంచడం ముఖ్యమైనది.

🌾 రైతులకు ఉపయోగకరమైన చిట్కాలు

  • కొత్తగా కొనుగోలు చేసే కోళ్లను మొదట 10–15 రోజులు వేరుగా ఉంచి పరిశీలించాలి.

  • పక్షులకు శుభ్రమైన నీరు, సరిచేసిన ఆహారం అందించాలి.

  • ఫారంలో శానిటేషన్ మరియు బయోసెక్యూరిటీ చర్యలు పాటించాలి.

Monday, November 14, 2022

కోళ్ళలో వైరస్ ల ప్రభావంతో వచ్చే వ్యాధులు! తీసుకోవాల్సిన జాగ్రత్తలు

 కోళ్ళలో వచ్చే వ్యాధులు ;


పుల్లోరం :

చిన్న పిల్లలు ఎక్కువగా ఈ వ్యాధికి గురవుతాయి. ఈ వ్యాధి తల్లి నుండి పిల్లలకు గుడ్ల ద్వారా కూడా సంక్రమిస్తుంది. రోగం సోకిన పిల్లలు గుంపులుగా గుమికూడటం, భారంగా శ్వాసతీయడం, రెక్కలు వాల్చడం లక్షణాలు ఉంటాయి. తెల్లని రెట్ట మలద్వారం వద్ద అంటుకొని ఉంటుంది. గుండె, గిజర్డ్‌, కాలేయం మరియు పేగులపై తెల్లని మచ్చలు కనిపిస్తాయి. నివారణకు ఆంటీ బయాటిక్‌ మందులు వాడాలి.

వీటితో పాటు రానికెట్ రోగం,రక్త పారుడు రోగాలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏదైనా కోడి మెత్తగా వుంటే వాటిని వెంటనే వైద్యులు చూపించి మందులను వాడటం మంచిది..లేదంటే మిగిలిన కోళ్లకు కూడా వ్యాధులు వ్యాపించి చనిపోయే ప్రమాదం వుంది


కోళ్ళ మశూచి :

కోళ్ళ అంటువ్యాధుల్లో ముఖ్యమైనది. ఈ వ్యాధి వలన గ్రుడ్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోవటం లేదా కోళ్ళు చనిపోవుటం జరుగుతుంది. మశూచి సోకిన కోళ్ళకు జుట్టు మీద, తుమ్మెలకు, కనురెప్పల చుట్టు పోక్కులు ఏర్పడతాయి. అప్పడుప్పడు కళ్ళల్లో కూడా ఈ పొక్కులు వచ్చి కళ్ళు కనబడవు. నివారణకు టీకాలు వేయించడం ఒక్కటే మార్గం. ఇవి 6 వారాల వయసులో మరలా 16వారాల వయసులో వేయాల్సి ఉంటుంది.


కొరైజ :

కోడి పిల్లలు సరిగా నీటిని, మేత తీసికొనక బరువును కోల్పోతాయి. ముక్కునుండి, కళ్ళనుండి నీరు కారుట రోగ లక్షణాలు. కళ్ళల్లో ఉబ్బి తెల్లని చీము గడ్డలుగా తయారవుతాయి. మరణసంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ఒకసారి ఈ వ్యాధి క్రిములు షెడ్డులోనికి ప్రవేశించిన, అన్ని బ్యాచ్లకు ఈ రోగం వస్తూనే ఉంటుంది.

ఒక బ్యాచ్లో ఈ వ్యాధి వచ్చినప్పడు కొద్ది రోజులు షెడ్డు ఖాళీగా పెట్టి, బ్లో లాంప్‌తో నేల, గోడలను కాల్చాలి. సున్నం, గమాక్సిన్‌, ఫినాయిల్‌, బ్లీచింగ్‌ పౌడర్‌ కలిపి జల్లివేయాలి. లిట్టరు ఎల్లప్పడు పొడిగా ఉండేలా చూడాలి. రోగం సోకిన పిల్లలకు యాంటిబయాటిక్‌ మందులు విటమిన్ల తో కలిపి వారం రోజుల పాటు వాడాలి.


ఎశ్చరీషియా కొలై :

బ్రాయిలర్‌ పిల్లల్లో ఈ వ్యాధి తీవ్రంగా వస్తుంది. బాక్టీరియా వల్ల కలిగే ఈ వ్యాధితో బ్రాయిలర్స్‌లో బరువు సరిగ్గా రాకపోవడం వల్ల నష్టం వాటిలుతుంది. ఈ వ్యాధి సోకిన కోడి పిల్లలు నీరసంగా ఉండి మేత సరిగా తినకపోవడం జరుగుతుంది. మరణించిన కోడి పిల్లల ప్రేగులు ఉబ్బి కనిపిస్తాయి. యాంటిబయోటిక్స్‌ మందులు మేతలో మరియు నీటిలో వాడితే ఈ వ్యాధి సోకిన పిల్లలను కాపాడవచ్చు. తాగు నీటితో పాటు సేనిటైజర్‌ మందును కోళ్ళకు ఇవ్వడం ద్వారా ఈ వ్యాధి బారిన పడకుండా కాపాడుకోవచ్చు.