LATEST UPDATES
Showing posts with label మొక్కజొన్న సాగు. Show all posts
Showing posts with label మొక్కజొన్న సాగు. Show all posts

Tuesday, November 18, 2025

జీరో టిల్లేజ్ విధానంలో మొక్కజొన్నలో కలుపు నివారణ – పూర్తి మార్గదర్శకం

జీరో టిల్లేజ్ లో  మొక్కజొన్న సాగు -- సూచనలు:

        జీరో టిల్లేజ్ పద్దతిలో వారి చేను కోశాక దుక్కి దున్నకుండానే పదును చూసుకొని మొక్కజొన్న విత్తనాలను నేరుగా విత్తుకోవాలి. బరువైన, తేమను నిలుపుకొనే నేలలో మాత్రమే ఈ పద్దతిని పాటించాలి. కోస్తా జిల్లాల్లో నవంబరు నుంచి జనవరి మొదటి వరం వరకు నాటవచ్చు. వరి కోత తర్వాత నేలలో తగినంత తేమ లేకపోతే ఒక తేలికపాటి తడిచ్చి పంట విత్తుకోవాలి. వరుసకు వరుసకు మధ్య 60 సెం. మీ, మొక్కకు మొక్కకు మధ్య 20 సెం. మీ, ఉండేట్లు విత్తాలి. 

జీరో టిల్లేజ్ మొక్కజొన్న లో కలుపు నివారణ:

        పంట విత్తిన 48 గంటల్లో 200 L నీటిలో అట్రాజిన్ 1 kg పొడి మందు కలిపి పిచికారీ చేయాలి. వారి దుబ్బులు చుగూరు వేయకుండా ఎకరాకు 200L నీటిలో పారాక్వాట్ 1 L కలిపి విత్తే ముందు లేదా విత్తాక పిచికారీ చేయాలి. 20-25 రోజులకు వెడల్పాటి కలుపు మాత్రమే ఉంటే 200L నీటిలో 400 గ్రా .. 2,4-D సోడియంసాల్ట్ కలిపి పిచికారీ చేయాలి. గడ్డి, ఆకు జాతి కలుపు ఉంటే ఎకరానికి 200L నీటిలో టెంబోట్రయాన్ 34.4% 115ml కలిపి పిచికారీ చేయాలి. 

జీరో టిల్లేజ్ మొక్కజొన్న సాగుకు అవసరమయ్యే ఎరువులు: 

        జీరో టిల్లజే మొక్కజొన్నలో మంచి దిగుబడి రావాలంటే పంటకు అవసరమైన ఎరువులను వివిధ దశల్లో అందించాలి. 

పంట విత్తేటపుడు 50kg DAP +20 KG MOP వేయాలి. 

పంట 20 రోజుల వయసులో 50 kg యూరియా 

పంట 40 రోజుల వయసులో 50 kg యూరియా 

పంట 60 రోజుల వయసులో 25 kg యూరియా + 15 kg MOP 

ప్రతి మూడు సీజన్లకు ఒక సారి జింక్ సల్ఫేట్ 20 kg లను అందించాలని నిపుణులు సూచిస్తున్నారు. 

జీరో టిల్లేజ్ మొక్కజొన్న సాగు -- అనువైన రకాలు:

        జీరో టిల్లజే మొక్కజొన్న సాగు విధానంలో పంట అవశేషాలతో నిండిన పొలాల్లో వేగంగా మొలకలోకి వచ్చే రకాలను, తెగుళ్లను తట్టుకొని అధిక దిగుబడినిస్తూ చేనుపై పడిపోని విత్తన రకాలను ఎంపిక చేసుకోవాలి. 

DHM 117, DHM 121, DHM 206, DHM 211, DHM 213, DHM 218, ADV 757, S35H270, KMH 8577, X35H270, LG 36611, Pro 311, Bio 9681, Seed Tech 2324 రకాలు జీరో టిల్లేజ్ విధానంలో సాగుకు అనుకూలమంటున్నారు నిపుణులు.