LATEST UPDATES
Showing posts with label డబ్బులు విడుదల. Show all posts
Showing posts with label డబ్బులు విడుదల. Show all posts

Monday, November 17, 2025

PM కిసాన్ 21వ విడత డబ్బులు విడుదల తేదీ ఖరారు! స్టేటస్ చెక్ చేయండి

        దేశంలోని అన్నదాతలందరికీ శుభవార్త! PM కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 21వ విడత నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 19వ తేదీన (నవంబర్ 19) గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ వ్యాప్తంగా 11 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లోకి ₹2,000 చొప్పున జమ చేయనున్నారు.

        రబీ పంట పెట్టుబడి సాయం కింద అందించే ఈ మొత్తం రైతులకు అత్యంత ఉపయుక్తం. ఈ పథకాన్ని 2019 ఫిబ్రవరి 24న ప్రారంభించగా, ఇప్పటివరకు 20 విడతల్లో రూ. 3.70 లక్షల కోట్లకు పైగా రైతులకు అందించబడింది. ఈ పథకం ప్రయోజనం పొందాలంటే, పీఎం కిసాన్ పోర్టల్‌లో నమోదై, బ్యాంకు ఖాతా ఆధార్‌తో తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి.

👉 గమనిక: PM కిసాన్ పోర్టల్‌లో నమోదు అయి, బ్యాంక్ ఖాతా ఆధార్‌కు లింక్ అయిన రైతులకే ఈ పథకం ప్రయోజనాలు అందుతాయి.

PM కిసాన్ 21వ విడత—ముఖ్యమైన విషయాలు

  • 📅 రిలోజ్ డేట్: ఈ నెల 19         (19-November-2025)

  • 💰 మొత్తం: అర్హత గల ప్రతి రైతుకు రూ.2,000

  • 👨‍🌾 లబ్ధిదారులు: 11 కోట్ల మంది రైతులు

  • 🏦 మొత్తం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT): 3.70 లక్షల కోట్లు (20 విడతలు)

 

PM కిసాన్ అర్హతను (Beneficiary Status) ఎలా చెక్ చేసుకోవాలి?

పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందొ? లేదో ? ఇలా చెక్ చేసుకోండి. 

ముందుగా PM కిసాన్ అధికారిక వెబ్ సైట్ https://pmkisan.gov.in/  ను సందర్శించాలి.

1. లబ్ధిదారుల జాబితా (Beneficiary List) చెక్ చేసే పద్ధతి

  1. వెబ్‌సైట్ సందర్శన: అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లండి.

  2. టాబ్ ఎంపిక: హోమ్‌పేజీలో ఉన్న "Beneficiary List" ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.

  3. వివరాలు ఎంపిక: అక్కడ అడిగిన విధంగా మీ రాష్ట్రం (State), జిల్లా (District), మండలం (Sub-District/Block), మరియు మీ గ్రామం (Village) వివరాలను ఎంపిక చేసుకోండి.

  4. రిపోర్ట్ పొందడం: "Get Report" టాబ్‌పై క్లిక్ చేయండి.

  5. జాబితా తనిఖీ: గ్రామాల వారీగా ఉన్న లబ్ధిదారుల జాబితా వస్తుంది. అందులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు.

2. పేమెంట్ స్టేటస్ (Payment Status) చెక్ చేసే పద్ధతి

మీరు ఇప్పటికే పథకంలో నమోదై ఉంటే, మీ చెల్లింపు స్థితి (Payment Status) తనిఖీ చేయడానికి:

  1. "Beneficiary Status" టాబ్‌పై క్లిక్ చేయండి.

  2. మీ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి.

  3. స్క్రీన్‌పై కనిపించే Captcha Code ను నమోదు చేయండి.

  4. "Get Data" పై క్లిక్ చేయండి.

  5. మీకు ఇప్పటివరకు అందిన విడతల వివరాలు, 21వ విడత స్టేటస్ (RFT Signed by State, FTO is Generated, Payment Processed) స్పష్టంగా కనిపిస్తుంది.

3. e-KYC మరియు ఆధార్ సీడింగ్ సమస్యలు ఉంటే ఏం చేయాలి?

మీ స్టేటస్‌లో "Aadhaar Seeding Status: No" అని లేదా "e-KYC Status: Pending" అని కనిపిస్తే, వెంటనే:

  • e-KYC కోసం: PM కిసాన్ వెబ్‌సైట్‌లో OTP ఆధారంగా e-KYC పూర్తి చేయండి లేదా దగ్గరలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC)కు వెళ్లండి.

  • బ్యాంక్ లింక్ కోసం: మీ బ్యాంకు బ్రాంచ్‌ను సంప్రదించి, మీ ఆధార్ నంబర్‌ను బ్యాంకు ఖాతాకు లింక్ చేయమని కోరండి. ఆధార్ లింక్ అయిన తర్వాతే మీకు డబ్బులు జమ అవుతాయి.

PM కిసాన్ డబ్బులు పొందాలంటే ఈ విషయాలు తప్పనిసరి

21వ విడత నిధులు అందాలంటే రైతులు ముఖ్యంగా రెండు అంశాలను పూర్తి చేసి ఉండాలి:

  1. e-KYC పూర్తి చేయాలి: e-KYC (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) పూర్తి చేసిన రైతులకు మాత్రమే నిధులు విడుదల అవుతాయి. e-KYC పూర్తి చేయని రైతులు వెంటనే అధికారిక వెబ్‌సైట్‌లో లేదా మీ దగ్గరలోని CSC కేంద్రంలో పూర్తి చేయాలి.

  2. Aadhaar-Bank Link: మీ బ్యాంకు ఖాతా తప్పనిసరిగా మీ ఆధార్‌తో అనుసంధానం (లింక్) అయి ఉండాలి.


FAQ – తరచూ అడిగే ప్రశ్నలు

1. PM కిసాన్ 21వ విడత ఎప్పుడు వస్తుంది?

ఈ నెల 19న విడుదల అవుతుంది.

2. ఒక్క రైతుకు ఎంత మొత్తం జమ అవుతుంది?

రూ.2,000 చొప్పున.

3. eKYC తప్పనిసరేనా?

అవును. eKYC లేకుంటే నిధులు రాకపోవచ్చు.

4. గ్రామ జాబితాలో పేరు కనబడకుండా ఉంటే ఏమి చేయాలి?

మీ మండల వ్యవసాయ కార్యాలయం / VAO / MRO ని సంప్రదించాలి.